బాంబుల మోతతో Gaza దేశం దద్ధరిల్లుతుంది

0
9

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ శుక్రవారం గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 24 మంది మృతి చెందారు. ఇందులో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాజా సిటితోపాటు వివిధ నగరాలపై బాంబుల వర్షం కురిసింది. పాలస్తీనా ఇస్లామిక్ జీహాద్ ఉగ్రవాదులే లక్ష్యంగా యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డారు.

ఆ సంస్థ మిలిటెంట్లు నివాసం ఉంటున్న భవనాలను నేలమట్టం చేశాయి. శుక్రవారం నుంచి మొదలైన ఈ దాడుల్లో ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలోని జబాలియా పట్టణంలో శనివారం అర్థరాత్రి పాలస్తీనా మిలిటెంట్లు పేల్చిన రాకెట్‌లో చిన్నారులతో సహా పౌరులు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అలాగే ఈ దాడుల్లో పదుల సంఖ్యలో గాయపడ్డారు.

అలాగే దక్షిణ నగరమైన రఫాలో జరిగిన వైమానిక దాడిలో ఒక ఇల్లు ధ్వంసమైంది. చుట్టుపక్కల భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. చిన్నారులు సహా కనీసం ఇద్దరు చనిపోయారని, 32 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శిథిలాల నుంచి ఓ బాలుడిని వెలికి తీశారు. ఈ దాడిలో చనిపోయిన మరో వ్యక్తిని ఇస్లామిక్ జిహాద్ అధికారి కుమారుడు జియాద్ అల్-ముదలాల్‌గా అతని కుటుంబ సభ్యులు గుర్తించారు.

అయితే ఇజ్రాయెల్ దాడులకు తీవ్రంగా స్పందించే హమాస్ ఈసారి ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రతీకార దాడులకు ఇంకా పాల్పడలేదు. పీఐజె మిలిటెంట్లే.. ఇజ్రాయెల్‌ నగరాలపై రాకెట్లను ప్రయోగిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యానికి మద్దతుగా ఆ దేశంలో ర్యాలీలు సాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here