బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న ఇంటూరి నాగేశ్వరరావు

0
4
eeturi nageshwar rao

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సహజ వనరులను దోచుకుంటూ కోట్లు కొల్లగొడుతున్నాడని కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. పట్టణంలోని 26వ వార్డు కేసరిగుంట కాలనీలో గురువారం బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం కూడా పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక, ప్రకృతి వనరులను కొల్లగొట్టేందుకే మొదట స్కెచ్ వేశారని, దానికి అనుగుణంగా ప్రతి జిల్లాలో కొండలను తవ్వి గ్రావెల్, మైనింగ్ దోపిడీ చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీ నేతలు మైనింగ్ వ్యాపారులను బెదిరించి క్వారీలను సొంతం చేసుకున్నారని, విచ్చలవిడిగా తవ్వకాలు సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. విశాఖలోని రిషికొండలో అక్రమ తవ్వకాలపై హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తీరు మారలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు లోపే ఇసుక దొరికేదని, జగన్ రెడ్డి సీఎం అయ్యాక 5 వేలు చెల్లించినా ఇసుక దొరకటం లేదన్నారు. వైసీపీ నేతలు ఇసుకను అక్రమంగా తరలించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, టిడిపి కార్యకర్తలు ఇళ్లు కట్టుకుంటున్నా ఇసుక తోలుకోవడానికి అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని నాగేశ్వరరావు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులతో పాటు అన్ని రకాల పన్నులు విపరీతంగా పెంచేశారని, ప్రజలు ఈ వాస్తవాలన్నీ ఇప్పటికే గుర్తించారని నాగేశ్వరరావు అన్నారు. మాజీ శాసనసభ్యులు దివి శివరాం మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని, జగన్ కు మరో అవకాశం ఇస్తే రాష్ట్రం సర్వనాశనం కావటం ఖాయమని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని శివరాం అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు అత్తింటి రత్తయ్య, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దివి సౌభాగ్య, వార్డు నాయకులు పొన్నగంటి వెంకట్రావు, మాదాల గోవర్ధన్, మల్లవరపు సీత, సిహెచ్ పద్మ, చవలం కేశవ,మచ్చా ప్రసాదు, చుండూరి శ్రీను, కల్లూరి వెంకటేశ్వర్లు, కత్తి చిన్నా, నవులూరి మాలకొండయ్య, ఉప్పుటూరు విష్ణు, బివి శ్రీను, అడపా కృష్ణవేణి, మల్లవరపు దుర్గ, పత్తిపాటి వెంకటేశ్వర్లు, మందలపు చెంచయ్య, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చిలకపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధికార ప్రతినిధి నాదెండ్ల వెంకటరమణయ్య, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు నాదెండ్ల సుబ్బారావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాసరావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పొడపాటి మహేష్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సలాం, పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం, ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, ఆదెమ్మ, రాధ, వడ్డెళ్ళ రవిచంద్ర, రెబ్బవరపు మాల్యాద్రి, కామినేని అశోక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here