బాలికకు వోడ్కా తాగించిన టీచర్.. 

0
4
tution teacher arrested

పాఠాలు చెప్పాల్సిన టీచర్ విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించాడు. బలవంతంగా బాలికకు ఆల్కహాల్ తాగించాడు. తర్వాత అరెస్టయ్యాడు.ఈ ఘటన గుజరాత్‌లోని నిజాంపురా ప్రాంతంలో ఇటీవల జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ ఖోస్లా అనే వ్యక్తి ట్యూషన్ క్లాసులు చెబుతుండే వాడు.గత బుధవారం రాత్రిపూట ట్యూషన్ ముగిసిన తర్వాత, ఒక పదో తరగతి విద్యార్థినిని ఆల్కహాల్ తీసుకోమని బలవంతం చేశాడు. తనతోపాటు కూర్చొని వోడ్కా తాగాలి అని కోరాడు. బలవంతంగా ఆ బాలికకు వోడ్కా తాగించాడు. తర్వాత ఆ బాలిక స్పృహ కోల్పోయింది. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మత్తులో ఉన్న బాలికను ఇంటి దగ్గర దింపేశాడు. బాలిక తల్లిదండ్రులు ఆమె పరిస్థితి చూసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తర్వాత కోలుకుంది. జరిగిన ఘటన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్‌ను అరెస్టు చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here