బాల్యం నుండే పిల్లలకు ధ్యానంపై అవగాహన కలిగించాలి

0
13
Children should be made aware of meditation from childhood.

ఒంగోలు: స్థానిక తాత కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ వారి ధ్యాన దసరా సంబరాలు కార్యక్రమాల్లో భాగంగా గురువారం సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ విజయలక్ష్మి, రాము, రమేష్ లు ధ్యాన సందేశాలు ఇచ్చారు. రమేష్ వారి సంగీతం తో సామూహిక ధ్యానం నిర్వహించారు. బడిలో ధ్యానం చేయించాలని చూస్తే వారి పాఠ్యాంశాలకు అడ్డువస్తుందని, గుడిలో ధ్యానం చేయాలని చూస్తే అక్కడ వారి సంప్రదాయాలకు విఘాతం కలుగుతుంది.

ప్రతి ఊరిలో ప్రతి చోట పిరమిడ్లు నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, బాల్యం నుండే పిల్లలకు ధ్యానం పై అవగాహన కలిగించి వారిని ధ్యానం చేసే విధంగా తయారు చేయాలని తెలిపారు. మనిషిలోని ఆరు శత్రువులైన ధ్యానం అనే తాడుతో కట్టివేసి నాడు పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైన వ్యక్తిగా మనగలుగుతాడని ఈ సందర్భముగా పిరమిడ్ ధ్యాన మాస్టర్ విజయలక్ష్మి వివరించారు. పెద్ద ఎత్తున ధ్యానులు, ప్రజలు సమావేశములకు తరలి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here