భారత స్వాతంత్ర్య సమరానికి తన దూరదృష్టితో దిశానిర్దేశం చేసినవారు లోకమాన్య బాలగంగాధర తిలక్. దేశంలో మహాత్మా గాంధీ శకం ప్రారంభానికి ముందు ఆయనే అతి పెద్ద కాంగ్రెస్ నాయకుడు. స్వాతంత్ర్యతా సమరసేనాని లోకమాన్య బాలాగంగాధర్ తిలక్ గారి శతవర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాము "స్వరాజ్యం నా జన్మ హక్కు" అని చాటిన సుప్రసిధ్ధ స్వతంత్ర్య సమరయోధుడు, భయమంటే ఎరుగని సాహసికుడు, బ్రిటీష్ వారి ఆంక్షలను ధిక్కరించిన ధీశాలి, జాతీయోద్యమానికి ఊపిరిలూదిన అభ్యుదయవాది, ప్రజలను చైతన్యం చేయడానికి విద్యాసంస్ధలను, పత్రికలను సమర్ధవంతంగా నడిపిన స్పూర్తి ప్రదాత, కష్టాలతో అనారోగ్యాలతో ఉన్న పేదప్రజలకు సహాయం చేసిన మానవతావాది, బ్రిటీష్ వారి అన్యాయాలను పత్రికల్లోకి ఏకిపారేసి వారి గుండెల్లో గుబులు పుట్టించిన సృష్టించిన పాత్రికేయుడు, ప్రజలలో ఉద్యమభావాల్ని పెంచి బ్రిటీష్ ప్రభుత్వానికి అశాంతి కలిగించిన ఉద్యమకారుడు, కార్మికుల కష్టాలను చూసి చలించిపోయి పటిష్టమైన కార్మిసంఘ ఏర్పాటుకు భాటలువేసిన కార్మిక పక్షపాతి, భారతీయులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడిన న్యాయవాది. వారు చూపిన మార్గం, ధైర్యసాహసాలు, దేశం కోసం చేసిన త్యాగం చిరస్మరణీయం. సార్వజనిక వినాయక ఉత్సవాలకు పిలుపునిచ్చి ప్రజల్లో స్వాతంత్ర్యసాధన కోసం చైతన్యం తీసుకురావడంతోపాటు. మంచి వక్తగా, పాత్రికేయుడిగా, ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా, సామాజిక సంస్కర్తగా వారు చేసిన కృషి, నేటి యువతకు స్ఫూర్తిదాయకం. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుంటూ, వారికివే జోహరులు.. మహనీయులను స్మరించుకుందాం, నివాళులు అర్పిద్దాం