20 రోజుల క్రితం బాసర ట్రిపుల్ఐటీలోని కేంద్రీయ భండార్ మెస్‌లో తిన్న విద్యార్థులు ఫుడ్‌పాయిజన్ బారిన పడ్డారు. దాదాపు 600మంది విద్యార్థులు అనారోగ్యం పాలవగా, 20మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత సీరియస్ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఇవేవీ తమకు పట్టవన్నట్లు సదరు మెస్ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన కేంద్రీయ భండార్ మెస్‌లోనే తాజాగా స్నానాల సీన్ బయటకు వచ్చింది.వంటగదిలోనే..: ఇరువైపులా.. విద్యార్థుల కోసం వండి, వడ్డించే వంటపాత్రలు ఉన్న గదిలోనే ఇద్దరు సిబ్బంది స్నానాలు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. వేలమంది విద్యార్థుల కోసం వంటలు చేసేచోట స్నానాలు చేయడం ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. వరుసగా చెడు ఘటనలు చోటుచేసుకుంటూ, రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నా..మార్పు మాత్రం లేదు.