బిశ్వభూషణ్ హరిచందన్ 88వ పుట్టినరోజు

0
4
biswabhushan harichandran

బిశ్వభూషణ్ హరిచందన్ ఒడిషా రాష్ట్రానికి చెందిన ఒక రాజకియ నాయకుడు, న్యాయవాది, కవి, రచయిత, అవినీతిపై పోరాడే యోధుడు. 2019 జూలై 17 న ఇతడు ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి గవర్నరు గా నియమించబడ్డారు .

అతను ఒడీశాలోని ఖుర్దాకు చెందినవారు. అతను 1934 ఆగస్టు 3న జన్మించాడు. అతనికి జనసంఘ్ తో దశాబ్దాల అనుబంధం ఉంది. ఒడిశాలో ‘సంఘ్‌’ కార్యకలాపాలు విస్తరించేందుకు అతను 1964లో అక్కడ భారతీయ జనసంఘ్‌ శాఖను ఏర్పరిచారు. స్వయం సేవకుడుగా ఉన్న అతను జనసంఘ్ లో చేరి చురుకుగా పనిచేశారు. జనసంఘ్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. 1975లో ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళనలో పాల్గొని జైలుకు కూడా వెళ్లాడు. 1977లో జన్‌సంఘ్‌ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో హరిచందన్‌ ఒకరు. ఇప్పటిదాకా రెండుసార్లు జనతా పార్టీ టికెట్‌పై, మూడుసార్లు భారతీయ జనతా పార్టీ తరఫున మొత్తం ఐదుసార్లు శాసనసభ్యునిగా గెలిచాడు. రెవెన్యూ, న్యాయ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1980 నుంచి ఎనిమిదేళ్లపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు. ఆ తర్వాత జనతా పార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1996లో ఆయన తిరిగి బీజేపీలోకి వచ్చేశారు.

1977 ఒడీశా అసెంబ్లీ ఎన్నికలలో చిలికా శాసనసభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1990 అసెంబ్లీ ఎన్నికలలో చిలికా శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ పార్టీ తరపున పోటీ చెసి రెండవసారి శాసనసభ్యునిగా ఎంపిక కాబడ్డాడు. 2000 అసెంబ్లీ ఎన్నికలలో భువనేశ్వర్ శాసనసభ నియోకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికలలో భువనేశ్వర్ శాసనసభ నియోకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు.

అతను బి.జె.పి-జె.డియు సంకీర్ణ ప్రభుత్వంలో న్యాయ, రెవెన్యూ, ఫిషరీస్ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. అతను 1971లో భారతీయ జనస్ంఘ్ లో చేరి 1977లో జనతా పార్టీ పారంభమయ్యే వరకు జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భాద్యతలను నిర్వహించారు. ఇతడు సుదీర్ఘకాలంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో అనుబంధం కలిగివున్నారు. 1988 నుంచి భారతీయ జనతా పార్టీ లో క్రియాశీలంగా ఉంటూ రచయితగా పలు పుస్తకాలు రాశారు. అవినీతిపై పోరు, మొక్కల పెంపకంపై ఇతడికి ఆసక్తి ఉంది.

పూరీలోని జగన్నాథ మందిరంలో ఆయన అనేక సంస్కరణలను చేపట్టాడు. ఆలయం మార్గంలోను, ఆలయంలోనూ మరణించిన భక్తులకు, పూజారులకు బీమా సౌకర్యం కల్పించడం, ఆలయం చుట్టూ సరిహద్దు గోడ నిర్మించడం వంటి చర్యలు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here