బీజేపీ నాయకుడి దారుణ హత్య.. 

0
8

బీహార్‌లో మరో బీజేపీ నేత హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం షాపుర్ పంచాయతీలోని ఓ కోపరేటివ్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్న విపిన్ కుమార్‌ను కొంతమంది దుండగులు కాపు కాసి కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు.

బీజేపీ నాయకులు వరసగా హత్యకు గురవుతున్నారు. ఇటీవలె కర్ణాటకలో ఓ బీజేపీ యువనేత హత్యకు గురికాగా.. ఇంతలోనే బీహార్‌లో మరొక నాయకుడు హత్యకు గురయ్యాడు. దీంతో ఆ రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. మాధేపుర జిల్లాలో శుక్రవారం రాత్రి విపిన్ కుమార్ సింగ్ అనే బీజేపీ నేతను దుండగులు కాల్చి చంపేశారు.

విపిన్ కుమార్ (59) ప్రస్తుతం షాపుర్ పంచాయతీలోని ఓ కోపరేటివ్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. శుక్రవారం కారులో ఒంటరిగా వెళ్తున్న సమయంలో తిక్కర్ టోలామోర్ ప్రాంతంలో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌లపై కారును వెంబడించి విపిన్‌పై కాల్పులు జరిపారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంబంధిత ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఆరు బుల్లెట్ షెల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కాగా ఇటీవలె దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువనేత ప్రవీణ్ నెట్టార్ హత్యకు గురయ్యారు. కొంతమంది దుండగులు మూకుమ్మడిగా అతడిపై దాడి చేశారు. దాంతో ప్రవీణ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు. అలాగే మంగళూరు నగరంలో కూడా మరో హత్య జరిగింది. గురువారం సాయంత్రం స్థానిక యువకుడిని కత్తితో పొడిచి కొందరు హత్య చేశారు. తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. చనిపోయిన వ్యక్తిని పోలీసులు మహ్మద్ ఫాజిల్‌గా పోలీసులు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here