బీటెక్ స్టూడెంట్‎కు రూ.3కోట్ల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌..

0
5

 బీటెక్ విద్యార్థి తాను చదువుకున్న కాలేజీలో నిర్వహించిన జాబ్ డ్రైవ్‎లో ఏకంగా రూ. 3 కోట్ల ప్యాకేజీతో ఎంపికయ్యాడు.

 ప్రస్తుతం పెద్ద పెద్ద కంపెనీలు విద్యార్థులను చదువుకునే సమయంలోనే క్యాంపస్ ప్లేస్‎మెంట్‎ ద్వారా ఎంపిక చేసి జాబ్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. భారీ ప్యాకేజీలతో ఉన్నత స్థానం కల్పిస్తున్నాయి. దీంతో విద్యార్థులు కాలేజీలో ఉండగానే జాబ్ ఆఫర్ అందుకుంటున్నారు. తాజాగా ఓ బీటెక్ విద్యార్థి తాను చదువుకున్న కాలేజీలో నిర్వహించిన జాబ్ డ్రైవ్‎లో ఏకంగా రూ. 3 కోట్ల ప్యాకేజీతో ఎంపికయ్యాడు. వివరాల్లోకెళ్తే..

కేరళకు చెందిన మహమ్మద్ యాసిర్.. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో BTech CSE పూర్తిచేశాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే మంచి టెక్నికల్ ఫండమెంటల్స్, AI, ML వంటి కొత్త సాంకేతికతతో పాటు అనేక అంశాలను నేర్చుకున్నాడు. అంతేకాకుండా.. క్యాంపస్‌లో నిర్వహించే అనేక హ్యాకథాన్‌లు మరియు ఇతర సాంకేతిక ఈవెంట్‌లలో పాల్గొనేవాడు. దాంతో అన్నీ అంశాలపై మంచి పట్టు సాధించాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత వేరే ఏ కోర్సు నేర్చుకోలేదు. అయినా తనకున్న స్కిల్స్‎తోనే జర్మనీకి చెందిన ఓ ఎంఎన్‌సీ కంపెనీలో జాబ్ సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here