బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి…

0
2

బి.సీల ద్రోహి, అవకాశవాది ఆర్ కృష్ణయ్య బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి….తమ్మిశెట్టి చక్రవర్తి

ఈరోజు విజయవాడ మారుతీనగర్లోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికావిలేకరుల సమావేశంలో తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ దేశ తొలి సామాజిక విప్లవకారుడు, నిజమైన సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారిని అవమానించిన వైఎస్ఆర్ రాజ్యసభ సభ్యుడు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బీసీ ఉద్యమ కారుడు ముసుగులో ఉన్న అగ్ర కులాలకు బీసీలని తాకట్టు పెట్టి లబ్ది పొందుతున్న ద్రోహి, అవకాశవాది మహాత్మా జ్యోతిరావు పూలే పేరును గురుకులాల నుండి తొలగించాలని డిమాండ్ చేసిన బి.సి.ల ద్రోహి ఆర్ కృష్ణయ్య బీసీ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశ తొలి సామాజిక విప్లవకారుడు, సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో గురుకుల పాఠశాలను ప్రభుత్వాలు నడపడం గర్వించదగ్గ విషయం అయితే 50సంవత్సరాలుగా బి.సి.లకోసం ఉద్యమాల నడిపామని చెప్పుకుంటూ బి.సి.లని అగ్రకులాలకి తాకట్టుపెట్టి స్వలాభం చేసుకుంటున్న వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని మరోసారి మహాత్మా జ్యోతిరావు పూలే పై చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అని అన్నారు. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ లకి, రహదారులకు, భవనాలకి, పథకాలకు పార్టీనాయకుల పేర్లు తెసేయ్యాలని ఎందుకు డిమాండ్ చెయ్యలేదో చెప్పాలని నిలదీశారు. తక్షణమే ఆర్ కృష్ణయ్య బి.సి.ల సమాజానికి క్షమాపణ చెప్పాలని లేకపోతే ఆయనని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు.

 రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు దామాషా ప్రకారం అన్ని అవకాశాలు దక్కాలని నాటి బ్రిటీష్ ప్రభుత్వం చేత హంటర్ కమిషన్ వేయించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని అటువంటి నేత పేరు గురుకులాలకి తొలిగించాలని అనడం ఆర్ కృష్ణయ్య బి.సి.లకి ద్రోహము చేసిన వ్యక్తిగా చరిత్ర హీనుడుగా ముగులుతాడని వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని లేకపోతే ఆయన ఇంటిని ముట్టడించడానికి వెనుకాడమని హెచ్చరించారు. ఈసమావేశంలో తొగటివీరషక్త్రియా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు, వడ్డెర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, వడ్డెర యువజన అధ్యక్షుడు వేముల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here