బైక్ కీ కోసం కొడుకు చేయి నరికిన తండ్రి.. 

0
5
father kills his son for bike key
father kills his son for bike key

మధ్యప్రదేశ్‌లోని దమో ప్రాంతంలో మోతీ పటేల్ , అతడి పెద్ద కొడుకు రామ్ కిషన్ , చిన్న కొడుకు సంతోష్ పటేల్ మధ్య బైక్ కీ విషయంలో గొడవ తలెత్తింది.తాము బయటకు వెళ్లాలని, బైక్ కీ ఇవ్వాలని మోతీ పటేల్, రామ్ కిషన్.. సంతోష్‌ను అడిగారు. అయితే, దీనికి సంతోష్ నిరాకరించాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. బైక్ కీ ఇవ్వకపోవడంతో తండ్రి మోతీ పటేల్, అన్న రామ్ కిషన్.. సంతోష్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో మరింత కోపం తెచ్చుకున్న తండ్రి, గొడ్డలి తీసుకొచ్చి కొడుకు చేయి నరికాడు. తర్వాత తెగిపడిన కొడుకు చేయితో పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే సంతోష్ చేయి నుంచి విపరీతమైన రక్తస్రావం జరిగింది. పోలీసులు అతడ్ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.కానీ, అతడి పరిస్థితి విషమంగా ఉందని, మరింత మెరుగైన వైద్యం కోసం జబల్‌పూర్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో జబల్‌పూర్ తరలిస్తుండగా, అధిక రక్తస్రావం వల్ల మార్గమధ్యలో మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు మోతీ పటేల్, రామ్ కిషన్‌ను అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here