బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆగ్ర‌హం…

0
8

8 గంట‌లు ఎందుకు ప‌ని చేయ‌రు?… టీచ‌ర్ల‌ను నిల‌దీసిన మంత్రి బొత్స‌!

డిమాండ్ల‌తో స‌చివాల‌యంలో బొత్స‌ను క‌లిసిన ఉపాధ్యాయ సంఘాలు
బెదిరిస్తే ప‌నులు కావన్న మంత్రి బొత్స‌
అనుకున్న‌వ‌న్నీ కావాలంటే ఎలాగంటూ నిల‌దీత‌

ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, వారికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న పీడీఎఫ్ ఎమ్మెల్సీలపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనుకున్న‌వ‌న్నీ కావాల‌ని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులు… ప్ర‌భుత్వం కోరుతున్న‌ట్లుగా 8 గంట‌ల పాటు ఎందుకు ప‌నిచేయ‌ర‌ని ఆయ‌న వారిని నిల‌దీశారు. ఈ మేరకు మంగ‌ళ‌వారం స‌చివాలయంలో త‌మ డిమాండ్ల‌తో ప‌లు ఉపాధ్యాయ సంఘాల నేత‌లు త‌న‌ను క‌లిసిన సందర్భంగా మంత్రి బొత్స వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మ‌రో కీల‌క వ్యాఖ్య కూడా చేశారు. ఉపాధ్యాయ సంఘాలు బెదిరింపు ధోర‌ణితో డిమాండ్ల‌ను సాధించుకునేందుకు య‌త్నిస్తున్నాయ‌ని ఆరోపించిన మంత్రి… బెదిరిస్తే ప‌నులు కావ‌ని తేల్చి చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు అనుకున్న‌వ‌న్నీ కావాలంటే ఎలాగంటూ బొత్స ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగానే ఉపాధ్యాయులు 8 గంట‌లు ఎందుకు ప‌నిచేయ‌ర‌ని మంత్రి ఉపాధ్యాయ సంఘాల‌ను నిల‌దీశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here