బ్యాంకు లో తనఖా పెట్టి కోటి రూపాయలు రుణాలు..

0
12

శావల్యాపురం చైతన్య గోదావరి బ్యాంకు కు టోకరా…!!!,

పోలాలే లేని వాటికి పాసు పుస్తకాలు,ఆ పుస్తకాలు బ్యాంకు లో తనఖా పెట్టి కోటి రూపాయలు రుణాలు…!!!,

రుణాలు పొందిన వారు శావల్యాపురం మండలం పిచికలపాలేం,కారు మంచి,వినుకొండ కు చెందిన వారిగా చిరునామాలు నమోదు,

ఇంకా పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయని బ్యాంకు సిబ్బంది.

వినుకొండ:- శావల్యాపురం మండల కేంద్రంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు లో 2017-2018 ఆర్థిక సంవత్సరంలో వినుకొండ, శావల్యాపురం మండలం పిచికలపాలేం, కారుమంచి కి చెందిన పది మంది పట్టాదారు పాసుపుస్తకాల పై సూమారు కోటి రూపాయల రుణం పొందినట్లు సమాచారం,మూడు సంవత్సరాలైనా పదిమంది లో ఒక్కరైనా ఒక్క రూపాయి కూడా బ్యాంకు లో జయ చేయకపోవడంతో రుణాలు వసూలు కోసం బ్యాంకు సిబ్బంది ఆ యా గ్రామాల్లో విచారణ చేపట్టగా రుణాలు పొందిన వారి పేర్ల తో అసలు పోలాలు లేనట్లు తెలుసుకున్నారు, అసలు పోలాలే లేని వాటికి పాసుపుస్తకాలు ఏలా వచ్చాయి,అవి ఏవరు మంజూరు చేశారు,అవి తీసుకుని వచ్చి బ్యాంకు లో తనఖా పెట్టి కోటి రూపాయలు రుణాలు పై బ్యాంకు సిబ్బంది ఉన్నతాధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ సంఘటన పై పోలిస్ వారికి ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.

రుణాలు మంజూరు చేసే సమయంలో బ్యాంకు అధికారులు విచారణ చేపట్టారా లేదా చేపటితే అప్పుడు అన్ లైన్లో ఉన్న వివరాలు ఇప్పుడు ఎందుకు లేవు…??? ఈ సంఘటన లో రెవెన్యూ అధికారులు, బ్యాంకు సిబ్బంది సహకారం ఉన్నదా లేదా అనేది ఫిర్యాదు అనంతరం పోలిస్ అధికారుల విచారణ అనంతరం వెలుగులోకి వస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here