బ్లాక్‌ అండ్‌ వైట్‌లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్..

0
2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేశారు. బ్లాక్ టీషర్ట్ లో స్ట్రెయిట్ హెయిర్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు బన్నీ. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోషూట్ కి సంబంధించిన మరిన్ని పిక్స్ త్వరలోనే షేర్ చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘పుష్ప’ సినిమాలో ఉంగరాల జుట్టుతో కనిపించిన బన్నీ ఇప్పుడు హెయిర్ స్ట్రయిటెన్ చేయించుకోవడంతో ఈ లుక్ తోనే ‘పుష్ప2’లో కనిపిస్తారా..? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఆగస్టు నుంచి ‘పుష్ప2’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పార్ట్ 2 రాసుకుంటున్నారు దర్శకుడు సుకుమార్. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారు.

కథ ప్రకారం.. ‘పుష్ప2’లో కొత్త క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయని సమాచారం. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను రూ.350 కోట్ల బడ్జెట్ లో చిత్రీకరించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈఏడాది డిసెంబర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here