Psycho Husband: ఆ నీచుడికి నా శవాన్ని కూడా తాకే అర్హత లేదు డైరీ రాసి గర్భిణి ఆత్మహత్య బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.దుర్మార్గుడిలా మారిన భర్త వేధింపులు తట్టుకోలేక మూడు నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ నగర శివారు బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం నింపింది. భర్త పెడుతున్న చిత్రహింసలు ఇన్నా్ళ్లూ మౌనంగా భరిస్తూ వచ్చిన అమాయకురాలు.. సహనం నశించి చావే శరణ్యమనుకుంది. తన భర్త మానసిక రోగి, రాక్షసుడని పేర్కొంటూ.. అతడికి తన శవాన్ని తాకే అర్హత కూడా లేదంటూ డైరీలో రాసుకుంది.
- బాలాపూర్ ఇన్స్పెక్టర్ భాస్కర్ కథనం ప్రకారం… షాహిన్‌నగర్ జుబైద్ కాలనీలో ఉండే ఖాజా మొహియుద్దీన్ అన్సారీ, షబానా బేగం దంపతుల ఐదో కుమార్తె ఫిర్దోస్ అన్సారీ(29) ఎంబీఏ చదివింది. ఆమెకు గతేడాది ఫిబ్రవరి 1న చార్మినార్ ఫతేదర్వాజాకు చెందిన వ్యాపారి సుల్తాన్ పటేల్(30)తో వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి ఫిర్దోస్ అన్సారీకి భర్త వేధింపులు మొదలయ్యాయి. ఆమె ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ బెల్టుతో చితకబాదేవాడు. చివరికి అన్న వరుసయ్యే ఆడపడుచు భర్తతో మాట్లాడినా అనుమానించి వేధించేవాడు.
- తన ప్రవర్తను గురించి పుట్టింటి వాళ్లకు చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తానని భర్త బెదిరించడంతో అతడి పైశాచికత్వాన్ని ఫిర్దోస్ మౌనంగా భరిస్తూ వచ్చింది. ఏకాంతంగా గడిపిన దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కి పాల్పడేవాడు. ఆమెకు రెండుసార్లు అబార్షన్ కాగా సంతోషపడ్డాడు.
- ప్రస్తుతం ఫిర్దోస్ మూడు నెలల గర్భవతి కావడంతో తల్లిదండ్రుల వద్ద ఉండాలని గత నెలలో పుట్టింటికి పంపేశాడు. ఈనెల 1న షాహిన్‌నగర్‌లోని అత్త గారింటికి వచ్చి భార్యను దుర్భాషలాడుతూ అందరిముందు చితకబాది వెళ్లిపోయాడు.