భార్యని బుజ్జగించాలి అని లీవ్ అడిగిన ఉద్యోగి

0
2
leave for wife convience

కాన్పూర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని బుజ్జగించి తనను తీసుకురావడానికి మూడు రోజులు సెలవు ఇవ్వాలని కోరాడు.కాన్పూర్‌‌కు చెందిన షమ్షాద్ అహ్మద్ అనే వ్యక్తి ఉత్తర్ప్రదేశ్ బేసిక్ శిక్షా అధికారి-బీఎస్ఏ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు అర్జంట్‌గా సెలవు కావాల్సి వచ్చింది. దాంతో ప్రేమ్‌ నగర్‌ బ్లాక్‌ అభివృద్ధి అధికారి (బీడీఓ)కి మంగళవారం లేఖ రాశారు. అందులో తనకు సెలవు కావాలని, అది ఎంత ముఖ్యమో వివరిస్తూ చెప్పారు. ఓ విషయంలో తన భార్యతో గొడవ జరిగిందని, దాంతో ఆమె పిల్లలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందని సర్దిచెప్పి ఆమెను తిరిగి తీసుకురావాలని అహ్మద్ తన లేఖలో పేర్కొన్నారు.”నేను బాధపడుతున్నాను. ఆమెను తిరిగి వచ్చేలా ఒప్పించడానికి నేను ఆమె గ్రామానికి వెళ్లాలి. అందుకోసం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు అత్యవసర సెలవు కావాలి. దయచేసి నా సెలవు దరఖాస్తును అంగీకరించండి” అని హిందీలో ఆ లేఖలో రాశారు. అయితే షమ్షాద్ అహ్మద్ అభ్యర్థనను బీడీవో అధికారి ఆమోదించారు. ఆ ఆమోదించిన సెలవు దరఖాస్తు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లెటర్ చాలా విచిత్రంగా ఉండడంతో క్షణాల్లో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తెగ షేర్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here