మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ కీలక నిర్ణయం

0
6
errabelli pradeep

 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని.. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి తమ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లా నుంచి రాజీనామాలకు సిద్ధపడటం చర్చకు దారి తీస్తోంది. ఇటీవలే తెలంగాణ ఉద్యమకారుడు రాజయ్యయాదవ్ రాజీనామా చేయగా.. తాజాగా మరో కీలక నేత కారు దిగేందుకు సిద్ధమయ్యారు.తెలంగాణ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సోదరుడు.. ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 7వ తేదీన ఆయన టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తన అనుచరులతో ప్రదీప్‌ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించి.. టీఆర్‌ఎస్‌కు రాజీనామాతో పాటు తన భవిష్యత ప్రణాళికలపై చర్చించనున్నట్లు సమాచారం. దీంతో వరంగల్ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మంత్రి తమ్ముడే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.2023 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ (Telangana BJP) పావులు కదుపుతోంది. జాయినింగ్ కమిటీ అని ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి.. దానికి కన్వీనర్ గా ఈటల రాజేందర్ ను నియమించింది. ఈ కమిటీ ద్వారా భారీగా చేరికలు ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే.. పలు కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైన బీజేపీ.. గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here