మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయం..

0
3

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడ‌మ కాలికి గాయ‌మైంది. జారీ పడడంతో ఎడమకాలి మడమ చీర మండలంలో క్రాక్ ఏర్పడింది. దీంతో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు కేటీఆర్‌కు సూచించారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఇవాళ కింద ప‌డిపోయాను. ఎడ‌మ కాలి మ‌డ‌మ‌కు గాయ‌మైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ స‌మ‌యంలో చూడటానికి మంచిఓటీటీ షోలు ఏం ఉన్నాయో స‌ల‌హా ఇస్తారా?’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా కేటీఆర్‌ పుట్టిన రోజు. బర్త్‌డేకు ఒక రోజు ముందే గాయపడటంతో అభిమానులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించిన విషయం తెలదిసిందే . భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here