మంత్రి గుడివాడ అమర్ నాథ్ వింత వివరణ..

0
4

మద్యపాన నిషేధంపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ వింత వివరణ

మద్యపాన నిషేధంపై ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వింత వివరణ ఇచ్చారు.మద్య నిషేధం అనే మాటే చెప్పలేదని బుకాయించారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.”మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యం నిషేధిస్తాం. మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తాం” ఇదీ వైకాపా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నాలుగు లైన్ల వాగ్దానం. కానీ, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాత్రం మద్య నిషేధం అనే మాటే మా మేనిఫెస్టోలో లేదంటున్నారు. మేనిఫెస్టోలో మీరు ఈ మాట చెప్పారు.. చెప్పిన మాట ప్రకారం చేయలేదంటే ప్రశ్నించండి అని మీడియా ప్రతినిధులకు సవాల్‌ విసిరారు. మద్యం రేట్లు ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో కంటే ఎక్కువ పెడతాం, ఎవరైనా ముట్టుకోవాలంటే షాక్‌ కొట్టే పరిస్థితి తీసుకొస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా మా మేనిఫెస్టో గోడలపై ఉంటుంది.. వెళ్లి చూసుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు. అసలు ఎన్నికల ప్రణాళికలో ఏ ముందంటే?..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here