మద్యం నిషేధాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన Jagan ప్రభుత్వం

0
4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని , ముఖ్యమంత్రి పీఠంమీద ఎక్కి కూర్చోవాలని అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆడబిడ్డలను మోసపు మాటలతో నమ్మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మద్యాన్ని విడతల వారీగా పూర్తిగా నిషేధిస్తానని బూటకపు మాటలు చెప్పిన ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కందుకూరు నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు దివి సౌభాగ్య కోరారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు భద్రత లేకుండా పోయిందని , కనీసం వారి రక్షణకోసం ఏర్పాటు చేసినటువంటి చట్టాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుట్టాలుగా తయారు చేశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల దాటిన మద్యపాన నిషేధం ఎక్కడ అమలుకావడం లేదని రాబోవు 25 సంవత్సరాలకు మద్యం షాపులమీద అప్పు తెచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని ఇకనైనా ఆడబిడ్డలు ప్రశాంతంగా జీవించేలా మద్యపాన నిషేధాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని లేని పక్షంలో తెలుగుమహిళ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బెల్ట్ షాపుల ముందు ధర్నాలు చేస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడతల వారీగా మద్యపాన నిషేధం అమలు చేయడం సంగతి దేవుడు ఎరుగుగాని విడతల వారీగా బెల్ట్ షాపులు , బార్ అండ్ రెస్టారెంట్లకు అధికంగా పర్మిషన్లు ఇస్తున్నారని ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలను మానుకొని సక్రమమైన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపాలని లేని పక్షంలో మహిళలు చేసే ఉద్యమంలో ఏమైనా జరగరానిది జరిగితే దానికి జగన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమం స్థానిక పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం అంబేద్కర్ సాక్షిగా కల్తీ లిక్కర్ బాటిల్స్ పగలగొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పులిమి శైలజ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి విజయమ్మ కందుకూరు పట్టణ అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీ రాజ్యం , అల్లం సుమతి , కుమారి మయూరి , రాధ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here