మనిషి లో గేదె ఆత్మ 

0
6

గేదె ఆత్మ తనలో ప్రవేశించిందని చెప్పుకుంటూ ఓ వ్యక్తి దాని మాదిరిగానే దాణా, మేత తింటూ చుట్టుపక్కల వారిని ఆకర్షిస్తున్నారు. నాగపంచమి రోజున ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మహరాజాగంజ్‌లోని రుద్రపూర్ శివనాథ్ గ్రామానికి చెందిన బుధిరామ్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా నాగపంచమి రోజున తనలో బైంసాసుర ఆత్మ ప్రవేశిస్తుందని విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. రోడ్‌వేస్‌లో ఉద్యోగిగా పదవీవిరమణ చేసిన బుధిరామ్ చేసే ఈ విన్యాసాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనాలు భారీగా తరలివస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆయన తనలో బైంసాసుర (గేదె) ఆత్మ ప్రవేశించిందని విన్యాసాలు చేశారు.గ్రామంలోని మాత ఆలయంలో ప్రతిష్టించిన భైంసాసురుని విగ్రహం ముందు కూర్చొని గడ్డి, పశుగ్రాసం వంటి వాటిని ఆ శబ్దంతోనే తింటున్న వీడియో వైరల్ అవుతోంది. స్థానికులు మాత్రం నాగపంచమి రోజున బుధిరామ్ జంతువుగా మారిపోతారని చెబుతున్నారు. ఆయనను దైవాంశంగా భావించి పూలతో స్వాగతం పలుకుతారు. బుద్ధిరామ్ ఈ ప్రత్యేకమైన విశ్వాసాన్ని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. గత 40 నుంచి 45 ఏళ్లుగా భైంసాసురుడి ఆత్మ తనలోకి వస్తుందని స్వయంగా బుద్ధిరామ్ చెప్పడం గమనార్హం.ఇది ప్రతి మూడేళ్లకు ఒకసారి నాగపంచమి తర్వాత ఇలా జరుగుతుంది. మిగిలిన రోజుల్లో సాధారణ జీవితం గడుపుతుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో బుధిరామ్ అచ్చం గేదెలాగే శబ్దాలు చేస్తూ దాణా, పచ్చగడ్డి మేస్తున్నారు. అక్కడి వచ్చే జనం ఆయనకు గడ్డి, అరటిపండ్లు వంటివి తినిపిస్తున్నారు. అంతేకాదు, ఆయన తాగిన తొట్టేలోని నీటి పవిత్రంగా భావించి ముట్టుకుని నమస్కారాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here