మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

0
2
rain

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. తెలంగాణపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. ఈ నెల7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

దీని ప్రభావంతో.. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజగిరి, మహబూబాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం రోజున.. కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహమబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఈనెల 6న రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది ఐఎండీ. నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్‌ , మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here