మళ్ళీ సీడ్స్ కంపెనీ నుంచి విష వాయువు లీక్

0
5

100 మంది మహిళలకు అస్వస్థత

అనకాపల్లి జిల్లాలో మంగళవారం మరోమారు విష వాయులు లీకైన ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే పలుమార్లు గ్యాస్ లీకై పలువురు ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం జిల్లాలోని అనకాపల్లి పరిధిలోని అచ్యుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ అపెరిల్ సిటీ పరిధిలో మరోసారి సీడ్స్ పరిశ్రమలో విష వాయువు లీకైంది. విష వాయువును పీల్చిన మహిళా ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 100 మంది దాకా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురరైనట్లు సమాచారం. విష వాయువును పీల్చిన కారణంగా వీరంతా వాంతులు, విరేచనాలకు గురై స్పృహ తప్పి పడిపోయారని తెలిసింది. పరిస్థితిని గమనించిన కంపెనీ యాజమాన్యం అస్వస్థతకు గురైన మహిళలను హుటాహుటీన ఆసుపత్రులకు తరలిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here