మహింద్రా ట్వీట్ వైరల్…

0
3

ఈ-ఆటోలో సాహసయాత్ర.. 17,900 అడుగులు ఎక్కేశాడు.. మహింద్రా ట్వీట్ వైరల్

ఎత్తయిన పర్వతాలతో.. ప్రశాంతమైన వాతావరణంగా లెహ్‌కి పేరు. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే.. సాహస ప్రయాణం చేయాల్సిందే. అలాంటి ఈ ప్రాంతానికి ఈ-ఆటోలో చేరుకున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి లెహ్‌లోని ఖర్దుంగ్ లా పాస్‌ను చేరుకున్న వీడియోను ఆనంద్ మహింద్రా షేర్ చేశారు. మహింద్రా ఎలక్ట్రిక్ ఆటోను ప్రపంచంలోనే అత్యంత ఎత్తులకు తీసుకెళ్లినందుకు థ్యాంక్యూ అంటూ మహింద్రా ట్వీట్ చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు ఖరీదైనవిగా మారడంతో పాటు కాలుష్య పెరుగుతుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను అడాప్ట్ చేసుకోవాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ప్రమోట్ చేస్తున్నప్పటికీ.. ప్రజలకు మాత్రం ఇంకా ఈ వెహికిల్స్‌పై నమ్మకం రావడం లేదు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే.. ఈవీలు తక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీ అనుమానాలు, సందేహాలన్ని పటాపంచెలవుతాయి

ప్రముఖ వ్యాపారవేత్త, మహింద్రా అండ్ మహింద్రా ఛైర్మన్ ఆనంద్ మహింద్రా తాజాగా ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక ఆటో డ్రైవర్ మహింద్రాకు చెందిన ట్రియో ఎలక్ట్రిక్ ఆటోలో లెహ్ జిల్లాలోని ఖర్దుంగ్ లా పాస్‌ను చేరుకున్నారు. ఎలక్ట్రిక్ ఆటో అక్కడికి చేరుకోవడం ఇదే తొలిసారి.

ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహింద్రా డ్రైవర్ జోతి విక్నేష్‌ను మెచ్చుకున్నారు. ఖుర్దుంగ్ లా పాస్ అనేది లెహ్‌లో 17,900 అడుగులకు పైగా ఎత్తులో ఉంటుంది. ‘‘ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులకు ట్రియోను తీసుకెళ్లినందుకు థ్యాంక్యూ జోతి..’’ అంటూ మహింద్రా ట్వీట్ చేశారు. మహింద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ గతేడాది డిసెంబర్‌లో ఈ ఎలక్ట్రిక్ త్రీవీలర్ ట్రియోను లాంచ్ చేసింది. దీని ధర ముంబైలో ఎక్స్‌షోరూంలో రూ.2.09 లక్షలుగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here