తుని పర్యటన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ వెళుతోంది.. జనాల మధ్య కుమారుడితో ఓ మహిళ నిలబడి ఉన్నారు. వెంటనే గమనించిన సీఎం.. వెంటనే తన కాన్వాయ్ ఆపి దిగి వెళ్లారు. ఆమె కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజ తన కష్టాన్ని చెప్పుకున్నారు. మహిళ చెప్పిన సమస్యను సావదానంగా విన్నారు.తన కుమారుడి ఆరోగ్య పరిస్ధితిని తనూజ ముఖ్యమంత్రికి వివరించారు. తమను ఎలాగైనా ఆదుకోవాలని కోరడంతో.. వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్‌ను పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి ఆనారోగ్య సమస్యను వివరించడంతో అప్పటికప్పుడు ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు అధికారులు. తమ సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న సీఎం జగన్‌కు తనూజ ధన్యవాదాలు తెలిపారు. మహిళ సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.
