మహిళా న్యాయమూర్తులకు ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వడం లేదు

0
7
samatha sainik dhal

సమతా సైనిక్ దళ్

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు చరిస్తారు, ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అని ఊరికే అనలేదు. ఇదంతా బ్రాహ్మణంలోని సోత్కర్ష. వాస్తవముగా దేశంలోని మహిళలందరూ శూద్రులే కనుక తగిన ప్రాతినిధ్యం మొదటి నుండి ఇవ్వబడలేదు.

 • “మహిళలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టి నేను సమాజం యొక్క పురోగతిని కొలుస్తాను.”డాక్టర్ అంబేడ్కర్.
 • అత్యంత కీలకమైన “లా అండ్ ఆర్డర్ అనేది శరీర రాజకీయాలకు ఔషధం మరియు శరీర రాజకీయాలు అనారోగ్యం పాలైనప్పుడు, ఔషధం తప్పనిసరిగా నిర్వహించబడాలి.”
 • భారత ప్రభుత్వం న్యాయ మంత్రిత్వశాఖ మరియు న్యాయశాఖ రాజ్యసభ నక్షత్రం లేని ప్రశ్న నం.1387 28.07.2022, గురువారం నాడు ఇచ్చిన సమాధానం.
 • భారత న్యాయవ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం DR.అమీ యాజ్ఞిక్ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అత్యంత సంతోషంతో ఇచ్చిన సమాచారం.
 • భారత న్యాయ వ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం అత్యల్ప, దుర్భరమైనది. సుప్రీంకోర్టు 1950లో ప్రారంభమైనప్పటి నుండి కేవలం 11 మంది మహిళా న్యాయ మూర్తులను మాత్రమే చూసిందనేది వాస్తవమైనది.
 • ఇది లింగాధారితంగా తక్కువ ప్రాతినిధ్యాన్ని న్యాయవ్యవస్థ వివక్షతతో చేయడం మాత్రమే.
 • భారతీయ న్యాయవ్యవస్థలోని మహిళా న్యాయమూర్తుల వివరాలు, రాష్ట్రాల వారీగా మరియు కోర్టుల వారీగా వివరాలు.
 • మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం శూన్యమైన కోర్టుల వివరాలు?
 • 25.07.2022 నాటికి, కేవలం నలుగురు మహిళా న్యాయమూర్తులు దేశంలోని అత్యున్నత సుప్రీంకోర్టులో ప్రస్తుతం మంజూరైన 34 మంది న్యాయమూర్తుల పోస్టులలో పని చేస్తున్నారు.
 • దేశంలోని గౌరవ వివిధ రాష్ట్రాలలో యూనియన్ టెరిటరీలోని హైకోర్టుల్లో మంజూరైన 1108 మందికి కేవలం 96 మంది మహిళా న్యాయమూర్తులు మాత్రమే పనిచేస్తున్నారు.
 • సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 124, 217 మరియు 224 ప్రకారం చేయబడింది. ఇది ఏ కులానికి లేదా వ్యక్తుల వర్గానికి రిజర్వేషన్లను అందించదు. అయితే, న్యాయమూర్తుల నియామకానికి ప్రతిపాదనలు పంపేటప్పుడు, నియామకంలో సామాజిక వైవిధ్యం ఉండేలా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలు మరియు మహిళలకు చెందిన తగిన అభ్యర్థులను తగిన పరిశీలన చేయాలని ప్రభుత్వం హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను అభ్యర్థిస్తోంది. హైకోర్టులలో న్యాయమూర్తులు రాజ్యాంగ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, సబార్డినేట్ కోర్టులలో న్యాయమూర్తుల ఎంపిక మరియు నియామకం సంబంధిత హైకోర్టులు మరియు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతతో మెలగాలి.
 • మహిళలకు అత్యున్నత గౌరవం ఇచ్చే భారతదేశంలో, మహిళా న్యాయమూర్తులకు ఇచ్చిన ప్రాతినిధ్యము మనుస్మృతి అమలులో భాగంగానే ఉంది తప్ప, భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్టు లేదు.
 • 25.07.2022 నాటికి, దేశంలో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం: న్యాయస్థానం పేరు;సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా=04 హైకోర్టులు: అలహాబాద్=05, ఆంధ్రప్రదేశ్=04, బొంబాయి=08, కలకత్తా=07, ఛత్తీస్‌గఢ్=01, ఢిల్లీ=12, గౌహతి=02, గుజరాత్=06, హిమాచల్ ప్రదేశ్=02, J&K మరియు లడఖ్=02, జార్ఖండ్=01, కర్ణాటక=05, కేరళ=06, మధ్యప్రదేశ్=03, మద్రాస్=12, మణిపూర్=00, మేఘాలయ=00, ఒరిస్సా=01, పాట్నా=00, పంజాబ్ & హర్యానా=07, రాజస్థాన్=02, సిక్కిం=01, తెలంగాణ=09, త్రిపుర=00, ఉత్తరాఖండ్=00 మొత్తం మహిళా న్యాయ మూర్తులు సంఖ్య=96.
 • 25.07.2022 నాటికి దేశంలో మహిళా న్యాయమూర్తులు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్, సివిల్ జడ్జి సీనియర్ డివిజన్, జిల్లా న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్.
 • భారతదేశంలోని 37 అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలలో సివిల్ జడ్జి జూనియర్ డివిజన్లో 3,719 మంది ఉన్నారు. సివిల్ జడ్జి సీనియర్ డివిజన్లో 1611 మంది ఉన్నారు. జిల్లా జడ్జిలుగా 1435 మంది మహిళలు ఉన్నారు.
 • భారత రాజ్యాంగంలో కనీసంగా 33 శాతం మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతుండగా, అత్యంత ప్రాముఖ్యమైన రాజ్యాంగబద్ధమైన ప్రాతినిధ్యం బహుజనులు కూడా ఇవ్వకుండా బ్రాహ్మణీయ సమాజం మోసం చేస్తున్నది. కాని రిజర్వేషన్లపై సమీక్ష జరగాలని సుప్రీమ్ కోర్టు చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here