మహిళా సర్పంచ్ పై లైంగికదాడి

0
7
rape attempt on sarpanch

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళా సర్పంచ్ పై 11 మంది కామాంధులు లైంగికదాడికి ప్రయత్నించారు.ఈ ఘటనపై బాధితురాలు విజయనగరం దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాను రేకుల షెడ్డులో ఉన్నప్పుడు పి. శ్రీనివాసరావు, పి. జగదీశ్, పి.భద్రరావు, పి. సుధాకర్, పి. రమణబాబు, ఎల్. సురేశ్ కుమార్, ఎ.శ్రీనివాసరావు, ఇ.సోమశేఖర్, ఎల్.వెంకటరాజు, పి. ప్రసాద్, పి. మధు అనే వ్యక్తులు వచ్చి లైంగిక దాడికి ప్రయత్నించారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. తాను ప్రతిఘటించే ప్రయత్నం చేస్తే…హత్య చేసేందుకు యత్నించారని చెప్పారు. పొత్తి కడుపు, మెడ, ఇతర అవయవాలపై దాడి చేశారని, చిత్ర హింసలకు గురి చేశారని చెప్పారు. తాను కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారని… దీంతో, వీరంతా పారిపోయారని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎస్సై శ్యామలాదేవి మాట్లాడుతూ… కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here