భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళా సాధికారత పట్ల మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె. శ్యాంబాబు అన్నారు. ఈరోజు ఒంగోలు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఒంగోలు వారి కార్యాలయంలో మహిళలకు సంబంధించిన చట్టాల పట్ల మరియు వారికి అందించే ఉచిత న్యాయ సహాయం గురించి న్యాయమూర్తి వివరించారు. సమాజంలోని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి తమ కాళ్ళ మీద తమ నిలబడాలని అన్నారు. మహిళల యొక్క ఆత్మ గౌరవానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన చట్ట ప్రకారం నేరమని మరియు శిక్షలకు గురి అవుతారని అన్నారు తదనంతరం న్యాయమూర్తి మహిళలతో ముఖాముఖి మాట్లాడుతూ వారి యొక్క న్యాయపరమైన సమస్యలకు పరిష్కారాలు సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకరాల తేళ్ల అరుణ న్యాయ సేవా సహాయకులు కట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు.