మహిళ హోంగార్డు ఆత్మహత్య..

0
5

కొడుకు ప్రేమ ఓ తల్లి ప్రాణాలు బలి కొనింది. తల్లి తన కొడుకుకు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో ఆమెకు జరిగిన అవమానంతో బలవన్మరణనికి పాల్పడింది. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగాపురం గ్రామానికి చెందిన సత్తనపల్లి సాలమ్మ బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ లో గత కొంతకాలంగా హోంగార్డుగా పనిచేస్తుంది. సాలమ్మకు ఇద్దరు కుమారులు.. పెద్ద కొడుకు వినయ్ కంభం పట్టణానికి చెందిన ఓ వేరే సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. మూడు నెలల కింద ఇంటి నుంచి వీరిద్దరూ వెళ్లిపోయారు. పెద్దలు ఇద్దరిని తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు.తర్వాత పెద్ద కుమారుడిని హోంగార్డు సాలమ్మ కాకినాడలోని కోచింగ్ సెంటర్ లో ఉంచింది.

మూడు నెలల తర్వాత మరో మారు ఇద్దరు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో సాలమ్మకు సమస్య మొదటికి వచ్చింది. అమ్మాయి తరపు బంధువులను సాలమ్మాను నిలదీశారు.దీంతో అవమానంగా భావించిన సాలమ్మ వాస్మైల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. మొదట సాలమ్మను వైద్యం కోసం ఒంగోలుకు తరలించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ హోంగార్డు సాలమ్మ కన్ను మూసింది.సాలమ్మ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

తర్వాత ఆమె డైరీలో సూసైడ్ నోట్ రాసిన సాలమ్మ అవమానంతో తాను ఆత్మహత్య చేసుకున్న అని ఎస్పీకి విన్నవించుకుంది.తన కుమారుడికి అన్ని రకాలుగా జాగ్రత్తలు చెప్పానని అయినా కానీ తన మాట వినలేదని పేర్కొంది.అమ్మాయి తరపు వాళ్లు తన ఇంటి వద్దకు వచ్చి కులం పేరుతో దూషించి చెప్పుకోలేని విధంగా తిట్టారని తనను రేప్ చేస్తానని బెదిరించారని లేఖలో రాసింది. తన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఎస్పీకి మొరపెట్టుకుంది..ప్రేమ మోజులో పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకుకు కనీసం తల్లి మరణ వార్త కూడా తెలిసిందో లేదో అంటూ సాలమ్మ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here