ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఒంగోలులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సహకరించవలసిందిగా కోరిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి.
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం శుభపరిణామమని, శ్యామ్ మా కుటుంబానికి అత్యంత ఆప్తుడని, చాలా ఏళ్లుగా పరిచయం ఉన్న మంచి వ్యక్తి అని తెలిపారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని మా పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జునులedను సమన్వయపరుచుకుంటూ, గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలిపారు.