మాజీమంత్రి శిద్దా నివాసంలో వైభవంగా వరలక్ష్మి వ్రత వేడుకలు

0
6

శ్రావణమాసం సందర్భంగా ఒంగోలు లోని వారి నివాసంలో రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు లక్ష్మీ పద్మావతి,శిద్దా సుధీర్ కుమార్, ఆధ్వర్యంలో శ్రీ వరలక్ష్మి వ్రత వేడుకలు వైభవంగా నిర్వహించారు.

వరలక్ష్మి వ్రతం పునస్కరించుకొని లక్ష్మీదేవిని శ్రీ వరలక్ష్మి దేవి గా సర్వాంగ సుందరంగా అలంకరించారు. శిద్దా లక్ష్మి పద్మావతి ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై ఆశీనులై విశేష పూలతో బంగారు, ఆభరణాల అలంకారంలో సాక్ష్యాత్తూ వరాలిచ్చే వరలక్ష్మి మాతగా భక్తులకు దర్శనం భాగ్యం కలిగించారు..వేద పండితులు నేలబోట్ల రామకృష్ణ శాస్త్రి,సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో శిద్దా రాఘవరావు లక్ష్మీ పద్మావతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి పూజ,కలశ స్థాపన,అమ్మవారికి షోడ సోపచార ,తోర బంధన పూజ,వరలక్ష్మి వ్రత కధ శ్రద్దాశక్తులతో ఆలకించారు, శ్రీమతి పద్మావతి అమ్మవారికి పసుపు కుంకుమ,స్వర్ణ ఆభరణాలు,పట్టు చీర,పుష్పాలు సమర్పించారు.శ్రీ వరలక్ష్మి వ్రత వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హజారై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీమతి లక్ష్మీ పద్మావతి ఆధ్వర్యంలో మహిళా భక్తులు సామూహిక శ్రీ.లలితా సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.అమ్మవారికి నైవేద్యం అనంతరం మంత్ర పుష్పం మంగళ నీరాజనాలు నిర్వహించిన అనంతరం శ్రీ వరలక్ష్మి వ్రతానికి విచ్చేసిన ముత్తైదువులకు శిద్దా లక్ష్మీ పద్మావతి స్వయంగా అమ్మవారి తీర్థప్రసాదాలు,పసుపు కుంకుమ పండు తాంబూలంతో వాయినాలు అందచేసారు.ఈ కార్యక్రమంలో శిద్దా పాండురంగారావు దంపతులు,శిద్దా సూర్య కుమారి,సంకా కృష్ణ మూర్తి దంపతులు, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు,,శిద్దా వెంకటేశ్వర్లు, శిద్దా పెద్ద బాబు,శిద్దా హనుమంతరావు,శిద్దా సూర్య ప్రకాశరావు,కోటి లింగం దంపతులు, శిద్దా హనుమంతరావు, శిద్దా వెంకట ప్రసాద్ దంపతులు, శిద్దా సాయిబాబు,శిద్దా బాలాజీ దంపతులు, శిద్దా సురేష్ దంపతులు,పవన్, రావిపూడి లక్ష్మినారాయణ,చలువాది హనుమంతరావు,గోల్డెన్ గ్రానైట్ ఏ.గిరి గ్రానైట్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒంగోలు, చీమకుర్తి కి చెందిన వాసవి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here