నాగ చైతన్య ఆమిర్ ఖాన్ తో కలిసి నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ . ఆగస్ట్ 11న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో నాగ చైతన్య బాలీవుడ్ మీడియాకు చెందిన రిపోర్టర్ ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. ఇప్పుడు మీరు అనుకోకుండా సమంతను కలుసుకుంటే ఏం చేస్తారు? అని అడిగాడు. దానికి చైతన్య ఏం తొట్రు పడకుండా..
నాగ చైతన్య , సమంత నాలుగేళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ తాము విడిపోయినట్లు ప్రకటించి దాదాపు ఏడాది కావొస్తుంది. అయితే వీరిద్దరికీ సంబంధించిన వార్తలు నెట్టింట మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్గా అయితే ఆ వార్తలు మరీ ఎక్కువయ్యాయి. అందుకు కారణం.. వరుసగా నాగ చైతన్య సినిమాలు విడుదలవుతుండటమే. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు సమంత గురించి నాగ చైతన్యను ప్రశ్నిస్తున్నారు. అందుకు ఆయన కూడా సమాధానం చెబుతూనే ఉన్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో సమంత గురించి అడిగినప్పుడు చైతన్య చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ సదరు ఇంటర్వ్యూలో సమంత గురించి నాగ చైతన్య ఏమన్నారనే వివరాల్లోకి వెళితే..
నాగ చైతన్య.. ఆమిర్ ఖాన్ తో కలిసి నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. ఆగస్ట్ 11న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో నాగ చైతన్య బాలీవుడ్ మీడియాకు చెందిన రిపోర్టర్ ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. ఇప్పుడు మీరు అనుకోకుండా సమంతను కలుసుకుంటే ఏం చేస్తారు? అని అడిగాడు. దానికి చైతన్య ఏం తొట్రు పడకుండా ఆమెకు హాయ్ చెప్పడమే కాకుండా హగ్ ఇస్తాను అన్నారు.
కొన్ని రోజుల ముందు మీడియా తన వ్యక్తిగత విషయాలపై మరీ ఎక్కువగా ఫోకస్ చేస్తుందని అది కాస్త ఇబ్బందిగా ఉందని నాగ చైతన్య చెప్పిన సంగతి తెలిసిందే. నిజానికి సమంత తో విడిపోయిన తర్వాత నాగ చైతన్య మీడియాకు వీలైనంత దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మీడియా ప్రశ్నలను ఎదుర్కొనక తప్పలేదు. దీంతో ఆయన సమంత గురించి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడుతున్నాడు కూడా.