మాధవ్ వీడియో పై రోజా స్పందన

0
13

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ కూడా స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. సీఎం జగన్ కూడా ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి రోజా దీనిపై స్పందించారు. గోరంట్ల మాధవ వీడియోపై తేల్చడానికి టైం పడుతుందని, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది మహిళలపై దారుణాలు జరిగినా పట్టించుకోలేదని ఆమె విమర్శలు గుప్పించారు.

దూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో (Gorantla Madhav) పై తీవ్ర దుమారం రేగుతుండగా.. దీనిపై మంత్రి ఆర్కే రోజా (Minister Roja) స్పందించారు. అసలు ఆ వీడియో.. నిజమైందో? కాదో? తెలుసుకోకుండా టీడీపీ (TDP) నేతలు విమర్శలు చేయడంపై మంత్రి రోజా మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుంటే అప్పుడే అంత తొందర దేనికని ఆమె ప్రశ్నించారు. గోరంట్ల మాధవ వీడియోపై తేల్చడానికి టైం పడుతుందని, తప్పుచేస్తే జగన్ (YS Jagan ) వదలిపెట్టరని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా టీడీపీ, జనసేన నేతలు తన నామజపం చేస్తున్నారని.. దీన్ని బట్టి తన మీద వారికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని రోజా కౌంటర్ ఇచ్చారు. కాయలున్న చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవని వ్యాఖ్యానించారు.

ప్రజల ఆశీస్సులతో తాను మంత్రి కావడం చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని రోజా విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది మహిళలపై దారుణాలు జరిగాయని.. వాటి గురించి పట్టించుకున్న పాపాన లేదని మంత్రి రోజా ధ్వజమెత్తారు. నారాయణ స్కూలులో ఎంతో మంది అమ్మాయిలు చనిపోయారని.. ఈ ఘటనలకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదుచేయలేదని ఆరోపించారు. మహిళలను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే జగన్ వదిలిపెట్టరని.. సీరియస్ యాక్షన్ తీసుకుంటారని రోజా స్పష్టం చేశారు. తప్పుచేస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

మరోవైపు, తాను కారు కొనుగోలు చేయడంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ నేను కారు కొనుగోలు చేస్తే అది రిషికొండ గిఫ్ట్ అంటూ ప్రచారం చేస్తున్నారు… ఈ రోజుల్లో చిన్న యాంకర్లు, చిన్న చిన్న నటులు కూడా కార్లు కొంటున్నారు… అయినా తాను కారు కొనడం గొప్పేమీ కాదు.. ఈ విషయంపైనా టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారు.. జబర్దస్త్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నానో బ్యాంక్ లావాదేవీలు చూస్తే తెలుస్తుంది… చదువురాని వారికి సమాధానం చెప్పాల్సిన పని లేదు’’ అంటూ రోజా విరుచుకుపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here