ప్రతి మనిషికి మరణం ఉంటుంది కానీ మానవత్వానికి ఉండదు
ప్రకాశం జిల్లా గిద్దలూరు లోని కుమ్మరాం కట్ట దగ్గర ఉన్న బస్సు సెల్టర్ నందు గత నాలుగు రోజులుగా ఓ గుర్తు తెలియని అవ్వ ఉంది. ఆ అవ్వ ఒక పాదము బాగా చీము పట్టి పాచిపోయినట్టు కూడా ఉంది బాగా దుర్వాసన వస్తోంది. ఈగలు, నల్లసీమలు, అవ్వ మీద వాలి నరకం చూస్తున్నా ఆ అవ్వను చూసి చలించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణ రెడ్డి సంఘసేవకులు , షేక్.ఖాజా హుస్సేన్ ఆ అవ్వకు చక్కగా మంచిగా స్నానం చేయించి నూతన బట్టలు వేయించిన తర్వాత వెంటనే మానవతా దృక్పథంతో
విషయం తెలుసుకొన్న
కృష్ణం శెట్టి ప్రాథమిక వైద్యులు డాక్టర్ షేక్ నాయబ్ రసూల్
వెంటనే స్పందించి చిము పట్టి ,ఈగలు, కాలిలో పురుగులతో బాధ పడుతున్నా ఆ అవ్వ కాలును శుభ్రపరిచి కట్టు కట్టారు . తమ మానవత్వం ను చాటుకున్నారు.
ఆ అవ్వ ప్రస్తుతము బస్సు సెంటర్ లోనే నడవ లేని పరిస్థతిలో ఉందని ఆ అవ్వ తరుపున వారు ఎవరైనా ఉంటే ఆదరించాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సంఘ సేవకర్త షేక్ ఖాజా హుస్సేన్,నెమలి గుండం, నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.