తనకు పెళ్లి వద్దూ చదువుకుంటానని మానవ హక్కుల కమిషన్ నీ ఆశ్రయించిన బాధితురాలు
కుత్బుల్లాపూర్ మండల్ జగదిరిగుట్ట పోలిస్ స్టేషన్ పరిధిలో నీ గాజుల రమారం కి చెందిన 19 సంవత్సరాల అమ్మాయి
డిగ్రీ 3 వ సంవత్సరం చదువుతున్న అమ్మాయికి గత నెల 31వ తారీకు న బలవంతంగా నిశ్చితార్థం చేయించిన కుటుంబ సభ్యులు
ఈ నెల20 వ తారీకున పెళ్లికి సిద్దమవుతున్న కుటుంబ సభ్యులు
అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని చదువుకుంటానని నచ్చ చెప్పిన పట్టించుకోని కుటుంబ సభ్యులు
అమ్మాయి ఇష్టంలేని పెళ్లి చదువు పై మక్కువతో కుటుంబ సభ్యులకు తెలియ కుండా ఇంటి నుంచి బయటకు వచ్చి మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది.
మానవ హక్కుల కమిషన్ అమ్మాయి ఫిర్యాదును స్వీకరించి రేపు ఉదయం
11 గంటలకు హియరింగ్ కి రమ్మని సూచించిన కమిషన్