మియామీ బీచ్‌లో భారత క్రికెటర్లు ఎంజాయ్!

0
6
indian cricketers in miaom beach

వెస్టిండీస్‌తో నాలుగో టీ20 ముంగిట భారత క్రికెటర్లు ప్లోరిడాలోని మియామీ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. భారత్, వెస్టిండీస్ మధ్య ప్లోరిడా వేదికగా శనివారం రాత్రి 8 గంటలకి నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే కొంత మంది భారత క్రికెటర్లు ప్లోరిడాకి చేరుకోగా.. కొంత మంది మాత్రం వీసా సమస్య కారణంగా విండీస్‌లోని సెయింట్ కిట్స్‌లోనే ఉండిపోయారు. గురువారం వరకూ ఆ ఆటగాళ్లకి యుఎస్ ట్రావెల్ డాక్యుమెంట్స్‌ రాలేదు. ఈరోజు మిగిలిన భారత ఆటగాళ్లు ప్లోరిడాకి చేరుకునే అవకాశం ఉంది.మ్యాచ్‌కి చాలా సమయం ఉండటంతో.. ప్లోరిడాకి ముందుగా చేరుకున్న భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్ , కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య, రవి బిష్ణోయ్, శ్రేయాస్ అయ్యర్ తదితరులు మియామీ బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. గత రెండేళ్లుగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్ట్రిక్ట్ బయో-సెక్యూర్ బబుల్‌లో ఉండి మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు.. చాలా రోజుల తర్వాత విదేశీ పర్యటనల్లో స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో భారత క్రికెటర్లు షేర్ చేశారు.వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ని 3-0తో స్వీప్ చేసేసిన టీమిండియా.. శనివారం నాలుగో టీ20లో గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సిరీస్‌ని 2-2తో సమం చేయాలని వెస్టిండీస్ ఆశిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here