మీడియా అధిపతిపై పరువు నష్టం దావా..

0
13

నిరూపిస్తే రాజీనామా చేస్తా.. మీడియా అధిపతిపై పరువు నష్టం దావా: ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణల్ని నిరూపించాలన్నారు.. తనపై దుర్మార్గంగా ఆరోపణలు చేశారని.. తాను పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చారు.

తెలుగు మీడియా ఛానల్ అధిపతికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు. తనపై రాధాకృష్ణ ఛానల్, పత్రికలో తప్పుడు వార్తలు రాయించారని.. విజయవాడలో తనకు మద్యం షాపుల బినామీలు ఉన్నట్లు దుర్మార్గంగా ఆరోపించారని మండిపడ్డారు. ఆయనకు దమ్ముంటే తన బినామీలు ఎవరో పేర్లు బయట పెట్టాలన్నారు.. ఆయన నీచపు బుద్ధి మానుకోవాలని హితవు పలికారు.

ఈ తప్పుడు కథనంపై పరువు ఇష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. మీడియా ఛానల్ అధిపతి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఆ ఛానల్, పత్రిలో వచ్చిన కథనం నిజం అని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఛాలెంజ్ చేశారు. తనకు విజయవాడలో మద్యం షాపులు ఉన్నట్లు తప్పుడు కథనాలు వేశారంటూ ఆ మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సవాల్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here