మీరాబాయి చాను కి కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్.

0
12

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కి ఫస్ట్ గోల్డ్ మెడల్ లభించింది. మహిళల 44 కేజీల వెయిట్‌లిప్టింగ్‌ విభాగంలో పోటీపడిన మీరాబాయి చాను శనివారం ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని గెలుపొందింది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్‌లో మొత్తం 201 కేజీలు ఎత్తిన మీరాబాయి చాను పసిడి పతకాన్ని భారత్‌కి అందించింది.ఈరోజు ఫైనల్లో స్నాచ్‌లో 88 కిలోలు బరువు ఎత్తిన మీరాబాయి చాను.. అనంతరం క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు ఎత్తింది. దాంతో.. మొత్తంగా 201 కేజీలతో ఆమెకి గోల్డ్ మెడల్ దక్కింది. వాస్తవానికి మీరాబాయి చాను క్లీన్ అండ్ జర్క్‌లో మూడో అటెంప్ట్‌లో 115 కేజీల బరువుని ఎత్తేందుకు ప్రయత్నించింది. కానీ.. విఫలమైంది. అయినప్పటికీ.. ఫైనల్లో మీరాబాయి చానుని ఎవరూ అధిగమించలేకపోయారు.కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి చాను పతకం గెలవడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు రజత పతకం గెలుపొందిన మీరాబాయి చాను.. తొలిసారి పసిడిని ముద్దాడింది. మీరాబాయి చాను పర్సనల్ రికార్డ్ ఈరోజు వరకూ క్లీన్ అండ్ జర్క్‌లో 109 కేజీలు ఉండగా.113 కేజీలతో తాజాగా ఆ రికార్డ్‌ని మరింత మెరుగు పర్చుకుంది.భారత్‌కి శనివారం వెయిట్‌లిప్టింగ్‌లో మూడు పతకాలు లభించాయి. తొలుత ఫురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ సాగర్ రజత పతకం గెలుపొందగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్య పతకాన్ని భారత్‌కి అందించాడు. అనంతరం మీరాబాయి చాను గోల్డ్ మెడల్‌తో మెరిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here