ముంబ‌యిలో మిడ్​నైట్​ కాల్పుల కలకలం

0
10
Midnight firing in Mumbai

దేశ ఆర్థిక రాజధాని ముంబ‌యిలో నిన్న అర్ధరాత్రి కాల్పులు కలకలం చెల‌రేగింది. కండివాలీ ప్రాంతంలో రాత్రి 12.15 గంటలప్పుడు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండ‌గులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఒక‌రు అక్కడికక్కడే చ‌నిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల త‌ర్వాత‌ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల‌ను హాస్పిట‌ల్‌కు తరలించారు.దీనికి వ్యక్తిగత గొడవలే కారణమని డీసీపీ విషాల్‌ ఠాకూల్‌ తెలిపారు. దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. మృతుడిని అంకిత్‌ యాదవ్‌గా గుర్తించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here