మునుగోడు ఉపఎన్నిక ఫలితాల్లో రౌండ్ రౌండ్‌కి ఫలితాలు మారిపోతున్నాయి. రౌండ్ రౌండ్‌కి అంచనాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒక రౌండ్లో టీఆర్ఎస్, మరో రౌండ్లో బీజేపీ లీడ్‌లోకి వస్తుండటంతో.. ఎవరు గెలుస్తారనేది ఇంకా ఎవరూ అంచనా వేయలేపోతున్నారు. మరిన్ని రౌండ్లు జరిగిన తర్వాత ఎవరు గెలుస్తారనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ చతికిలబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆశించినంత ఫలితం రాకపోవడంతో.. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు.