నరసరావుపేట నియోజకవర్గంలో ఆదివారం నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ చదలవాడ అరవిందబాబు విస్తృతంగా పర్యటించారు.నియోజకవర్గంలో అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ నాయకుల కుటుంబాలను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ నాయకులు కొర్నేపాటి లక్ష్మయ్య పార్దివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.ఇక్కుర్తి గ్రామంలో బీసీ యువజన సంఘం అధ్యక్షులు చల్ల వెంకట్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు.వారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అదే విధంగా రొంపిచర్ల మండలంలో ఏడ్వర్టపేట గ్రామంలో మృతి చెందిన కిషోర్ అనే యువకుడు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొడ్డపాటి పెరయ్య, కొల్లి బ్రహ్మయ్య,కొలికొండ కొండలు,ఇమిడిశెట్టి కాశయ్య,దండ శివరామకృష్ణ,చల్లగుండ్ల శ్రీను,కూరపాటి శ్రీను మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.