మెరిసే చర్మం, ఎర్రటి పెదవులు కావాలని అనుకుంటున్నారా..? 

0
3

జిడ్డు చర్మం, మొటిమాలతో బాధపడుతున్నారా? మెరిసే చర్మం మీకు కావాలని అనుకుంటున్నారా? అందమైన గులాబీ రంగు పెదవులు మీ సొంతం కావాలని అనుకుంటున్నారా?

జిడ్డు చర్మం, మొటిమలతో బాధపడుతున్నారా? మెరిసే చర్మం మీకు కావాలని అనుకుంటున్నారా? అందమైన గులాబీ రంగు పెదవులు మీ సొంతం కావాలని అనుకుంటున్నారా? ఇవన్నీ కావాలనుకుంటే మీరు ఎన్నో ప్రొడక్ట్స్ వాడాల్సిన పని లేదండీ. మీ వంటింట్లో ఉండే బీట్ రూట్ చాలు. అవును మీ ఈ సమస్యలన్నీటికి ఒక్కటే పరిష్కారం అదే బీట్ రూట్. దీన్ని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు, బీట్ రూట్ రసాన్ని పెదవులకు రాసుకోవచ్చు. ఇలా చెయ్యడం వల్ల అందమైన ముఖం మీ సొంతం అవుతుంది. 

బీట్‌రూట్‌లో కాల్షియం, ఐరన్, విటమిన్లు A మరియు C, ఫైబర్, ఫోలేట్ (విటమిన్ B9), మాంగనీస్ మరియు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. రక్త ప్రసరణ మెరుగుపరిచేందుకు సహాయపడటంతో పాటు రక్త పోటుని నివారిస్తుంది. అంతే కాదు ముఖంలో వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. జుట్టు పెరుగుదలకి, జుట్టు రాలిపోవడాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో చాలా సహజమైన విటమిన్లు, ప్రోటీన్లు, పొటాషియం మరియు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవన్నీ ఆరోగ్యకరమైన చర్మం మరియు జుట్టుకు చాలా ముఖ్యమైనవి. మీ డైట్లో క్రమం తప్పకుండా బీట్‌రూట్‌ జ్యూస్ తీసుకుంటే రక్తం పెరుగుతుంది. బీట్‌రూట్‌ రసంలో నిమ్మరసం లేదా కలబంద కలిపి మాడుకు పెట్టుకుంటే జుట్టుకి చాలా బాగా పని చేస్తుంది. బీట్‌రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు కూడా మీ చర్మాన్ని మెరుగుపరుస్తాయి. జిడ్డు చర్మం మరియు మొటిమల సమస్యలు ఉన్న వాళ్ళు బీట్ రూట్ తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే బాగుంటుంది. 

అందమైన పెదవుల కోసం.. 

బీట్ రూట్ రసాన్ని పెదవులపై రాసుకోవడం వల్ల దాని మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ఇలా చెయ్యడం వల్ల పెదవులు మృదువుగా మారతాయి. ఎర్రటి పెదవులు కావాలనుకున్న వాళ్ళు క్రమం తప్పకుండా ఈ రసం పెదవులకు రాసుకుంటే చక్కటి ఫలితం పొందవచ్చు. బీట్‌రూట్ రసాన్ని బాదంనూనె లేదా పెరుగుతో కలిపి 10-15 నిమిషాల పాటు ఫేస్ ప్యాక్‌గా అప్లై చేసుకుంటే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. బీట్‌రూట్‌లో బ్లీచింగ్ గుణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది లిప్ బామ్‌లలో భాగమైతే  మీ పెదవులకు మంచి రంగును ఇస్తుంది అవి పొడిబారకుండా చేస్తుంది. 

చర్మ, జుట్టు సంరక్షణకి.. 

ఇందులో ఉన్న విటమిన్ సి వల్ల మీ చర్మం పిగ్మెంటేషన్ నివారిస్తుంది. దీని రసం ముఖం మీద అప్లై చేసుకోవడం వల్ల చర్మం మీద పేరుకుపోయిన మృత కణాలను ఇది తొలగిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కళ్ల కింద ఏర్పడిన సంచులని, వలయాలని పోగొట్టేందుకు సహాయపడుతుంది. పగిలిన పెదవులపై బీట్ రూట్ రసాన్ని రాయడం వల్ల అవి తేమగా ఉంటాయి. జ్యూస్ లేదు గుజ్జుని జుట్టుకు రాసుకోవడం వల్ల కేశాలు మృదువుగా మారతాయి. ఇందులో ఉండే మినరల్స్ జుట్టు రాలే సమస్యను అరికట్టడంతో పాటు జుట్టు నిర్జీవంగా లేకుండా రిపేర్ చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here