అభం శుభం తెలియని చిన్నారి పై ఓ మానవ మృగం విరుచుకుపడ్డాడు. కర్కశంగా బాలిక ను అత్యాచారం చేసాడు. ఈ ఘటన మండపేట మండలం ద్వార పూడి శివారు వేములపల్లి లో సోమవారం చోటుచేసుకుంది. రూరల్ సి ఐ పెద్దిరెడ్డి శివ గణేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లి లోని రామకృష్ణ పౌల్ట్రీ వద్ద కార్మికుల మకాం లో పెంకే రమణ (58) అదే మకాం వద్ద తన అమ్మమ్మ నాయనమ్మ ల వద్ద కు వచ్చిన ఓ నాలుగేళ్ళ చిన్నారి పై అత్యాచారం జరిపాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో గుర్తించి న తల్లి కాకాడ నాగలక్ష్మి తన భర్త కాకాడ ప్రసాద్ కు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రామచంద్రపురం డి ఎస్ పి బాలచంద్ర రెడ్డి, సి ఐ పెద్ది రెడ్డి శివ గణేష్, రూరల్ ఎస్ ఐ బళ్ల శివ కృష్ణ లు ఘటన స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టారు. కాగా బాలిక తల్లిదండ్రులు వేములపల్లి ఇందిరమ్మ కాలనీ లో నివసిస్తున్నారు. తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ పౌల్ట్రీ ఫారం లో బాలిక అమ్మమ్మ, నానమ్మ లు చాలా కాలం నుండి పనిచేస్తూన్నారు. ఈ నేపథ్యంలో పెంకే రమణ కూడా ఉత్తరాంధ్ర జిల్లా ల నుండి ఇక్కడ కు చాలా ఏళ్ళ క్రితం వలస వచ్చాడు. ఇప్పుడు అతని భార్య ఆ కోళ్లఫారం లో పనికి వెళుతుంది. ఈ క్రమంలో ఆటలాడుకుంటున్న చిన్నారి ని రమణ తన ఇంట్లో కి తీసుకుని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు విచారణ అనంతరం డి ఎస్ పి బాలచంద్ర రెడ్డి మాట్లాడుతూ బాధితులు ఫిర్యాదు మేరకు పొక్సో, ఎస్ సి ఎస్ టి అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలిక ను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.