వర్గీకరణ కి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మాదిగలను మోసగించిన బిజెపి మాదిగ పల్లెలకు వస్తె ప్రతిఘటన తప్పదు…
సింగరాయకొండ లో నిరసన రాలీ తహశీల్దార్ కి వినతి పత్రం అంద జేసిన రావినూతల కోటి మాదిగ ..
ఎస్సీ రిజర్వేషన్ లను దామాషా ప్రకారం ఎ బి సి డి లుగా వర్గీకరించి మాదిగలకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం లో అధికార బిజెపి మాదిగలను మోసగించి పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించలేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సింగరాయకొండ నాయకుడు రావినూతల కోటి మాదిగ దుయ్యబట్టారు.

బుధవారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత కృష్ణ మాదిగ పిలుపు తో మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన లో భాగంగా నిరసన రాలీ చేపట్టారు. పాలకు మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టు కోకుండా మాదిగలను బిజెపి ప్రభుత్వం మోసగించిందని ఆయన దుయ్యబట్టారు. పార్లమెంట్ సమావేశాలలో మాదిగ రిజర్వేషన్ బిల్లు తెచ్చి మాదిగలకు న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన నిరసన ని సైతం పెడచెవిన పెట్టారని ఆయన విమర్శించారు.
మాదిగలను మోసగించి న బిజెపి నాయకులు మాదిగ పల్లెలకు వస్తె తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ముందుగా పోలీస్ స్టేషన్ సమీపం లోని అంబేత్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేత్కర్ విగ్రహం వద్ద నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన రాలీ చేపట్టారు. నిరసన రాలీ అనంతరం సింగరాయకొండ తహశీల్దార్ చనమాల ఉష కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు రేనమాల.మాధవ మాదిగ,వినోద్ మాదిగ,రమేష్ మాదిగ,జయపాల్ మాదిగ, మల్లి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
