మ్యాగీ తిని మహిళ మృతి..

0
5

ముంబైలో ఓ మహిళ తను చేసుకున్న పొరపాటుకు తనే బలైంది. మ్యాగీ చేసుకున్న తిన్న వెంటనే అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఎలుకల బెడద వదిలించుకోవడానికి తెచ్చిన విషాన్ని టమోటాల్లో కలిపి పెట్టి.. అదే టమోటాను మ్యాగీలో వేసుకోవడంతో ఆమె ప్రాణాలకే ముప్పు వచ్చింది. ఇదే విషయాన్ని ఆమె పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు ప్రమాద మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. అలా తన నిర్లక్ష్యానికి తనే బలైంది.

ముంబైలో ఓ మహిళ మ్యాగీ నూడిల్స్ తిని ప్రాణాలు కోల్పోయింది. చేజేతులారా తను చేసుకున్న పనికి తనే బలి అయింది. పొరపాటున ఎలుకల మందు కలిపిన టమోటాలు మ్యాగీలో కలవడంతో ఈ ప్రమాదం జరిగింది. ముంబైలోని మలాద్ పశ్చిమ ప్రాంతంలో రేఖా నిషాద్.. తన భర్త, మరిదితో కలసి నివాసం ఉంటుంది. ఆమె కూలీ పనులు కూడా చేసుకుంటుంది. అయితే ఆమె ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండడంతో.. వాటి బెడద వదిలించుకోవడానికి ఎలుకల విషం తీసుకొచ్చి.. టమోటాల్లో విషం కలిపి అవి తిరిగే ప్రదేశాల్లో పెట్టింది.

తర్వాత రేఖ టీవీ చూస్తూ మ్యాగీ చేసుకుంది. పొరపాటున ఎలుకలు కోసం పెట్టిన టమోటాలను తీసి.. తన మ్యాగీలో కలిపేసుకుంది. ఆ తర్వాత.. ఆ మ్యాగీని తినేసింది. తర్వాత ఆమె అనారోగ్యం పాలైంది. వెంటనే ఆమెను ముంబైలోని శతాబ్ది ఆస్పత్రికి ఆమెను తరలించగా అక్కడ డాక్టర్లు వైద్యం చికిత్స చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here