యాత్ర జయప్రదం చేయండి..

0
16

బీజేవైఎం యువ సంఘర్షణను యాత్ర జయప్రదం చేయండి

కొంగలవీటి విష్ణువర్ధన్ రెడ్డి
బీజేవైఎం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు

ఈరోజు మార్కాపురం ప్రెస్ క్లబ్ నందు బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యువ సంఘర్షణ యాత్ర పోస్టర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కొంగలవీటి విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యువ సంఘర్షణ యాత్ర ను చేపడుతున్నామని దీని ముఖ్య ఉద్దేశం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో దేశ స్వతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన యోధులను స్మరించుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వంలోకి రాకముందు ఇచ్చిన హామీలను మరి ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లక్షల 50 వేల పైగా ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, మహిళల భద్రత కొరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మన జిల్లాకు సంబంధించిన దొనకొండ పారిశ్రామిక వాడలను మరియు కనిగిరిలోని నింజును త్వరగా పూర్తిచేసి జిల్లాలోని యువకులకు ఉపాధి అవకాశాలును రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని దాని కొరకు యువకులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి యువ సంఘ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు కంభం వెంకట రమణ రావు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండారపు ఈశ్వర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు జివి రెడ్డి, బిజెపి పార్టీ జిల్లా సీనియర్ నాయకురాలు శ్రీ శాసనాల సరోజినీ గారు, బిజెపి పార్టీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ కడియం రామయ్య గారు మార్కాపురం బీజేవైఎం మండల అధ్యక్షుడు బొందిలి గణేష్ సింగ్ , చంద్ర భాను చిలుకూరి వేణుగోపాల్ , తర్లపాడు బీజేవైఎం మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here