యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..

0
5

ఆటోను ఢీకొన్న ఇన్నోవా.. ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం ఆటోను.. ఇన్నోవా ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరికొంతమంది గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఇన్నోవా, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో రెండు తుక్కు తుక్కుగా ధ్వంసమైపోయాయి. పైగా మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి.

స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టానికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం ఇన్నోవా వేగంగా దూసుకొచ్చి ఆటోను ఢీకొంది. దాంతో ఆటోలో ఉన్న ప్రయాణికులందరూ చనిపోయారు. మృతుల్లో పదేళ్ల చిన్నారి, ఏడేళ్ల వయస్సున్న పాప కూడా ఉంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఇన్నోవా డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసు అధికారి మహఫూజ్ ఆలం అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో కొంతమందిని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here