రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు..?

0
7

 శ్రావణ మాసానికి చాలా విశిష్టత ఉంది. ఈ నెలలో ఎన్నో పండగలు పర్వదినాలు వస్తాయి. శ్రావణ శుక్రవారం, శ్రావణ మంగళవారంతో పాటూ శ్రావణ పౌర్ణమిని రాఖీ పండుగగా జరుపుకుంటారు. పౌర్ణమి రోజున  సోదరీమణులు తమ మణికట్టుకు రాఖీ కట్టి సోదరుడి దీర్ఘాయుష్షు కోరుకుంటారు. తనకు రక్ష కట్టిన సోదరిని జీవితాంతం కాపాడతానని సోదరుడు వాగ్దానం చేస్తాడు.ఈ ఏడాది పౌర్ణమి గడియలు తగులు,మిగులు రావడంతో గందరగోళం నెలకొంది.  కొందరేమో ఆగస్టు 11వ తేదీన రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకోవాలని చెబుతున్నారు. మరి కొందరు 12వ తేదీ రాఖీ కట్టాలని చెబుతున్నారు. ఇంతకీ పౌర్ణమి తిథి ఎప్పుడొచ్చింది..ఎప్పటి వరకూ ఉందంటే. 

  • ఆగస్టు 11 గురువారం ఉదయం దాదాపు 10 గంటలకు ప్రారంభమైన పౌర్ణమి ఆగస్టు 12 శుక్రవారం ఉదయం 7.39 వరకూ ఉంది
  • పౌర్ణమి కదా చంద్రుడి లెక్క అని కొందరు, సూర్యోదయం తిథి లెక్క మరికొందరు. దీంతో రాఖీ గురువారం కొందరు, శుక్రవారం మరికొందరు జరుపుకుంటున్నారు
  • క్యాలెండర్ ప్రకారం రాఖీ పౌర్ణమి ఆగస్టు 11 గురువారం ఉంది. అయితే పండితులు చెప్పేదేంటంటే తెలుగు పండుగలకు చాలావరకూ సూర్యోదయం లెక్క కనుక పంచాంగం ప్రకారం శుక్రవారం రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని చెబుతున్నారు
  • పౌర్ణమి తిథి ఆగస్టు 12వ తేదీన సూర్యోదయానికి ముందు వస్తుంది కాబట్టి ఆ రోజంతా పౌర్ణమి తిథిగా పరిగణిస్తారు. అంటే ఈ రోజంతా రక్షాబంధన్ పండుగ జరుపుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here