రాఖీ ఎందుకు కడతారంటే..

0
6

అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం ఎంతో గొప్పది. నిజంగా ఆ బంధాన్ని వివరించడానికి మాటలు సరిపోవు. నిజంగా సోదరి, సోదరుడు మధ్య ఉండే బంధం ఎంతో అమూల్యమైనది. అందుకే రక్షా బంధన్ నాడు ప్రేమని చూపించి జరుపుకుంటూ ఉంటారు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో రక్షా బంధన్ కూడా ఒకటి.

రక్షాబంధన్ రోజు అన్నదమ్ములకి అక్క చెల్లెలు హారతిచ్చి.. బొట్టుపెట్టి… రాఖీ కట్టి ఏదైనా స్వీట్‌ని తినిపిస్తారు. ఆ తర్వాత అన్నాదమ్ములు తమ అక్కా చెల్లెళ్లకు బహుమతులు ఇస్తారు. ఇదంతా మనకి తెలుసు. కానీ మనకి తెలియని ఎన్నో విషయాలు ఇక్కడ వున్నాయి.

నేటి సమాజంలో మానవతా విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా మహిళలకు భద్రత ఉండటంలేదు. చట్టాలు కూడా కొంతమందికి చుట్టాలుగా మారుతున్న నేటి రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలని లేదు ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది.

అయితే రక్షా బంధన్‌ని కేవలం మన భారత దేశంలో మాత్రమే కాకుండా నేపాల్‌లో కూడా చేసుకుంటారు. నేపాల్లో కూడా సోదరి, సోదరుడు మధ్య ఉన్న బంధాన్ని మరియు ప్రేమని రక్షా బంధన్ నాడు తెలియజేస్తారు. అయితే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో రక్షా బంధన్ వస్తుంది. అంటే ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో వస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 22 న వచ్చింది.

అసలు రక్షా బంధన్ అంటే ఏమిటి ..?

ఈ పండగ మొత్తం రెండు పదాలతో కూడుకున్నది. ఒకటి రక్షణ మరొకటి బంధనం. సంస్కృతం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ పండుగని ముడితో రక్షణ ఇవ్వమని. రక్షణ అంటే రక్షణ కలిగించడం బంధం అంటే కట్టుకోవడం. అలానే ఇది కేవలం సోదరి సోదరుడు మాత్రమే జరుపుకొనే పండుగ కాదు. మరదలు, చెల్లెలు, కజిన్స్ ఇలా ఎవరైనా సరే సెలబ్రేట్ చేసుకోవచ్చు.

వివిధ మతాల్లో రక్షా బంధన్ :

అయితే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విధంగా రక్షా బంధన్ జరుపుకుంటారు. హిందువులు ఎక్కువగా హిందువులు ఈ పండుగను జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మరియు పడమర ప్రాంతాలలో తప్పక చేసుకుంటారు. అలానే నేపాల్, పాకిస్తాన్ లో జరుపుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here