పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఎదగండి.. వీడ్కోలు సభలో రామ్ నాథ్ కోవింద్
జాతి ప్రయోజనాల కోసం పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఎదగండని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం తన వీడ్కోలు ప్రసంగంలో రాజకీయ పార్టీలను కోరారు.
ప్రజల సంక్షేమం కోసం ఏది అవసరమో నిర్ణయించండని సూచించారు. పార్లమెంట్‌ను ప్రజాస్వామ్య దేవాలయమని సంభోదించిన కోవింద్.. సభలో చర్చల సమయంలో గాంధేయ తత్వాన్ని వినియోగించాలని కోరారు. పార్లమెంట్లో చర్చ, అసమ్మతి తెలియజేసే సమయంలో ఎంపిలు ఎల్లప్పుడూ గాంధీ తత్వాన్ని అనుసరించాలన్నారు. రాష్ట్రపతికి కోవింద్‌కు వీడ్కోలు పలికేందుకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గన్నారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ఆయన అభినందనలు తెలిపారు.